ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 21 నుంచి మూడు రోజులపాటు ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహిస్తామని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) తెలిపింది. ఈ కార్యక్రమానికి లక్ష మందికిపైగా మత ప్రముఖులను ఆహ్వానిస్తామని వీహెచ్పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ ఆదివారం చెప్పారు.