టిడిపి నేత వెనిగండ్ల రాము, వేనిగండ్ల రామకృష్ణ, కడియాల గణేష్ మరో 40 మందిపై ఐపిసి 341, 143, 188 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద మంగళవారం పోలీసులు కేసులు నమోదు చేశారు. 144 యాక్టును అతిక్రమించి చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ పోలీసులు అభియోగాలు మోపారు. అలాగే యూట్యూబర్ ఫిర్యాదు మేరకు రాము అనుచరుడు సందీప్ పై 427, 324, 506 ఐపీసీ సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు.