ఆపరేషన్ స్వేచ్ఛ-3లో భాగంగా మంగళవారం గుంటూరు నగరంలోని పలు దుకాణాల్లో బాల కార్మికులను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాయి. ఈ డ్రైవ్లో అధికారులు తొమ్మిది మంది బాల కార్మికులను గుర్తించి, సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపరిచారు. అనంతరం సీఐడీ గుంటూరు రీజినల్ ఎస్పీ కేజీవీ సరిత చిన్నారులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లలు చదువుకుంటే కలిగే ప్రయోజనాల గురించి వివరించారు.