చంద్రబాబు చేసిన స్కాములన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, ఇకపై చంద్రబాబు చిప్పకూడు తినాల్సిందేనని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఇన్నాళ్లూ అనేక స్కామ్‌లు చేసి స్టేలు తెచ్చుకొని పబ్బం గడుపుకున్నాడన్నారు. స్కిల్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబును సీఐడీ అరెస్టు చేస్తే దాన్ని కక్ష సాధింపు అంటూ టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు కట్టుదిట్టమైన భద్రత ఉందన్నారు. కావాలనే లోకేష్, అచ్చెన్నాయుడు ఓవరాక్షన్ చేస్తున్నారన్నారు. అవినీతి కేసులో అడ్డంగా బాబు దొరికిపోయాడన్నారు.