ఢిల్లీలో జరిగిన జీ20 సమావేశాల సందర్భంగా చైనా ప్రతినిధులు తీసుకొచ్చిన బ్యాగులు కలకలం రేపాయి. తాజ్ ప్యాలెస్ హోటల్లో బస చేసిన వారు విభిన్నమైన ఆకృతిలో ఉన్న బ్యాగులను తీసుకొచ్చారు. వాటిలో అనుమానస్పద వస్తువులు ఉన్నాయని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. అయితే డిప్లమాటిక్ ప్రోటోకాల్ అంటూ తనిఖీలకు చైనా ప్రతినిధులు అంగీకరించలేదు. 12 గంటల హైడ్రామా తర్వాత వాటిని ఆ దేశ ఎంబసీకి పంపించారు.