టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై జైల్లో ఉండడమే తప్పన్నట్లు టీడీపీ వాళ్లు మాట్లాడుతున్నారు అని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... టీడీపీ ప్రభుత్వంలో డబ్బులు ఎవరి చేతుల్లోకి వెళ్లాయి. కుట్రలతో కూడిన యజ్ఞంలా ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారు. స్కిల్ స్కామ్‌తో ప్రభుత్వ ఖజానాకు నేరుగా నష్టం వాటిల్లింది. దోచుకోవడానికే ఓ స్కీమ్ పెట్టారు. షెల్ కంపెనీల ద్వారా క్యాష్‌గా మార్చుకున్నారు. రాష్ట్ర ఖజానాకు వందల కోట్ల నష్టం కలిగించారు. పక్కా ఆధారాలతో సీఐడీ రిమాండ్ రిపోర్ట్ ఇచ్చింది. నేషనల్ ఏజెన్సీలు కూడా దోపిడీ రిపోర్ట్ ఇచ్చాయి. సీమెన్స్ కంపెనీ వాళ్లు మేం సీన్లోనే లేమని స్పష్టం చేశారని చెప్పారు. హవాలా వ్యవహారంపై ఈడీ కూడా విచారణ చేసిందని గుర్తు చేశారు. అన్ని ఆధారాలతో చంద్రబాబును అరెస్టు చేశారని తెలిపారు. యువత పేరు చెప్పి చంద్రబాబు దోచుకున్నారని, దోచుకోవడానికే ఒక స్కీం రూపొందించారని ఫైర్ అయ్యారు.