టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఐన సంగతి అందరికి తెలిసిందే. ఈ కేసు వాదిస్తున్నసిద్ధార్థ లూథ్రా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ... అన్నివిధాలా ప్రయత్నించినా, న్యాయం కనుచూపు మేరలో లేదని తెలిసినపుడు కత్తి తీసి యుద్ధం చేయడమే సరైంది అని బుధవారం ట్వీట్ చేశారు. సిక్కుల మత గురువు గురుగోవింగ్ సింగ్ సూక్తిని ఉటంకిస్తూ ఆయన చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.