యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సీఎం జగన్ ఈనెల 3న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. 3,295 పోస్టులు యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నాయని ఉన్నత విద్యాశాఖ అధికారులు వివరించారు. వాటి భర్తీకి 23న నోటిఫికేషన్లు జారీచేస్తామని, సెప్టెంబరు మూడు, నాలుగు వారాల్లో పరీక్షలు నిర్వహిస్తామని, అక్టోబరు 10న ఫలితాలు ప్రకటించి, నవంబరు 15లోగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తిచేస్తామని అధికారులు వివరించారు. దీనికి సీఎం జగన్ ఆమోదముద్ర వేశారు. కానీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన ఆగస్టు 23వ తేదీ దాటిపోయినా ఉన్నత విద్యా శాఖ నుంచి నోటిఫికేషన్లు మాత్రం విడుదల కాలేదు. దీంతో ఆశావహులు అసంతృప్తి కలిగివున్నారు. ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.