స్కిల్‌డెవల్‌పమెంట్ ప్రాజెక్టుపై ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన శరత్ అసోసియేట్స్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా నివేదిక ఇచ్చింది అంటూ కొన్ని పత్రికలలో వచ్చినా వార్తలని ఆ సంస్థ బుధవారం ఖండించింది. తాము అనేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు, ప్రైవేటు, ఆర్థిక సంస్థలకు విస్తృత స్థాయిలో సేవలందింస్తున్నామని పేర్కొంది. ఒక చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థగా తమ గవర్నింగ్ బాడీ ఐసీఏఐ ప్రమాణాల ప్రకారం.. తమ వెబ్‌సైట్‌లో క్లయింట్‌ల వివరాలు, అందించే సేవలు, సంస్థ వివరాలు తప్ప.. ఆడిట్‌కు సంబంధించిన వివరాలేమీ ప్రదర్శించరాదని, అందుకే థర్డ్ పార్టీ వెబ్‌సైట్లను వినియోగించుకుంటామని తెలిపింది. దేశంలోని వందలాది సీఏ సంస్థలకు థర్డ్‌పార్టీ సేవలందించే వెబ్‌టెల్ ఎలకో్ట్ర సాఫ్ట్ సంస్థే తమకు కూడా థర్డ్‌పార్టీ సేవలందిస్తుందని వెల్లడించింది.