ట్రాక్టర్‌ను అతివేగంగా నడిపి, ఒక వ్యక్తి మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్‌కు 15 రోజులు జైలు శిక్ష, రూ.500లు జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మేజిస్ర్టేట్ వేల్పుల కృష్ణమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు 2019, జూన్ 16న రైస్‌మిల్ కంప్రెసర్ కొనుగోలు నిమిత్తం కానుమోలు గ్రామం నుంచి సాధనాల శ్రీనివాసరావు, మామిడి సత్తిబాబు ట్రాక్టర్‌పై హనుమాన్ జంక్షన్ వెళ్లి వస్తుండగా, పెరికీడు గ్రామ సమీపంలో రాజ్యలక్ష్మి ఆయిల్ సర్వీసెస్ పెట్రోల్ బంకు వద్ద ట్రాక్టర్ ప్రమాదానికి గురై వెనుక ట్రాలీలో కూర్చున్న సాధనాల శ్రీనివాసరావు, మామిడి సత్తిబాబు కిందపడ్డారు. శ్రీనివాసరావు తీవ్ర గాయాలతో మృతి చెందగా, సత్తిబాబుకి స్వల్ప గాయాలయ్యాయి. నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపిన డ్రైవర్ చొప్పా నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి డ్రైవర్ నాగరాజుకు జైలుశిక్ష, జరిమానా విధించారు.