వైసీపీపై రోజురోజుకు పెరుగుతున్న ప్రజా వ్యతిరేఖత నుంచి దృష్టి మళ్లించేందుకు, చంద్రబాబుని అరెస్ట్ చేసారు అని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు అన్నారు. చంద్రబాబును ఎఫ్ఐఆర్లో తన పేరు లేకున్నా, కక్షపూరితంగా జగన్ ప్రభుత్వం ఇరికించిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్లో ఎటువంటి అక్రమాలు జరుగలేదని, ఆ సంస్థ సీఈవో స్వయంగా వెల్లడించినా, సీఐడీ అక్రమంగా రిమాండ్ విధించడం సరికాదన్నారు.