కొరిసపాడు మండలం కోరిసపాడు మండల పరిషత్ కార్యాలయం నందు గురువారం నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి వైసిపి ఇన్చార్జ్ బాచిన కృష్ణ చైతన్య పాల్గొని 161 మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరు పెన్షన్లు అందజేసి, ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కృష్ణ చైతన్య పేర్కొన్నారు.