ఆఫ్రికా దేశం లిబియాలోని డెర్నా నగరంలో డేనియల్ తుపాను సృష్టించిన జలప్రళయంలో 11,300 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ రెడ్ క్రెసెంట్ గురువారం వెల్లడించింది. మరో 10,100 మంది ఆచూకీ దొరకడంలేదని తెలిపింది. మరోవైపు డెర్నా నగరంలోని చాలా ప్రాంతాల్లో మట్టి, బురద పేరుకుపోయింది. వీటి మధ్యలో చాలా మృతదేహాలు ఉండిపోయి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa