నకిలీ ఓట్ల అంశంపై కూడా విచారణ చేయాలని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజి మంత్రి పేర్ని నాని డిమాండు చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఛీఫ్ ఎలక్ర్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాను వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజి మంత్రి పేర్ని నాని కలిపి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఓటర్ల పెరుగుదల నమోదు కాలేదు,ఈ విషయంపై ఎన్నికల కమిషన్ విచారణ జరపాలని వైయస్సార్సీపీ సీనియర్ నేత,మాజి మంత్రి శ్రీ పేర్ని నాని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ఛీఫ్ ఎలక్ర్టోరల్ ఆఫీసర్ శ్రీ ముఖేష్ కుమార్ మీనాకి వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో 2014 నుండి 2019వరకు, 2019 నుండి 2023 వరకు రాష్ట్రంలో నమోదైన ఓటర్ల సంఖ్య హెచ్చుతగ్గులకు సంబంధించి ఫిర్యాదులో పేర్కొన్నారు.