బాబుతో మేము సైతం అంటూ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. ఎర్రగొండపాలెంలోని యూనియన్ బ్యాంక్ సమీపంలో ఇంచార్జి గూడూరి ఏరిక్షన్ బాబు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షలో శనివారం పుల్లలచెరువు మండల నాయకులు పాల్గొని మాట్లాడారు. అక్రమ అరెస్టును ఖండిస్తూ విడుదల చేయాలని, సైకో సీఎం బుద్ధి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.