విజయనగరం జిల్లా రామభద్రపురం లో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.... రామభద్రపురం మండల కేంద్రానికి చెందిన ఉప్పల రమణమ్మ (75)కు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. మూడో కుమారుడు శ్రీనివాసరావు(45)కు తప్ప మిగతా వారికి వివాహాలయ్యాయి. మూడో కుమారుడు శ్రీనివాసరావుతో కలిసి రమణమ్మ ఓ అద్దె ఇంట్లో ఉండేది. శ్రీనివాస్ స్థానిక వసంతుల వీధిలో టిఫిన్ కొట్టు నడుపుతున్నాడు. మద్యానికి బానిసైన కొడుకును తల్లి తరచూ మందలిస్తుండేది. గురువారం రాత్రి మద్యం తాగేందుకు తల్లిని పింఛన్ డబ్బులు అడిగాడు. ఆమె నిరాకరించడంతో కోపంతో సుత్తి లాంటి కర్రతో రమణమ్మ తలపై మోది చంపేశాడు. అదే కర్రతో ఆమె నాలుకను పీకేశాడు. తెల్లవారే వరకు తల్లి మృతదేహం చెంతనే నిద్రించాడు. శుక్రవారం తెల్లవారుజామున తల్లి నాలుకను తీసుకుని వెళ్లి పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు.