నంద్యాల జిల్లా, నందికొట్కూరులో రైతులు మల్యాల ఎత్తిపోతల వద్ద ఆందోళన చేపట్టారు. కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయాలని మల్యాల, రైతులు అధికారులని అడిగారు. రైతుల ఆందోళన ఎమ్మెల్యే ఆర్థర్ దృష్టికి రావడంతో అధికారులకు ఫోన్ చేసి నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో రెండు పంపుల ద్వారా 700 క్యూసెక్కుల నీటిని కేసీ కెనాల్‌కు అధికారులు నీటిని విడుదల చేశారు.