విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బుద్దా వెంకన్న కార్యాలయంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బీసీ నాయకులు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ..... ‘‘బీసీలను అన్ని విధాలా అభివృద్ధి చెందేలా చేసిన నాయకులు ఎన్టీఆర్, చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి బీసీలను నాశనం చేశారు. కార్పొరేషన్లు పెట్టి నిధులు ఇవ్వని సీఎం జగన్మోహన్ రెడ్డి. మంత్రి రోజా సిగ్గు లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడమే జగన్ లక్ష్యమని చెబుతుంది. పగలు, ప్రతీకారాలతో పాలన చేస్తే రాష్ట్రం నాశనం అవుతుంది. చంద్రబాబు అరెస్టును జాతీయ నాయకులు, జాతీయ మీడియా ఖండించింది. 74 ఏళ్ల వ్యక్తిని కక్ష కట్టి సాధించడం దుర్మార్గం అని అన్నారు.