సందర్శకుల వీసాపై, విద్యార్థుల వీసాపై బ్రిటన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకొంది. ఆర్నెల్ల కంటే తక్కువ సమయం బ్రిటన్ లో ఉండే సందర్శకులకు వీసా ఫీజుపై రూ.1,543... విద్యార్థుల వీసా ఫీజును రూ.13,070 మేర పెంచుతున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. పెంచిన ఫీజు అనంతరం సందర్శకుల వీసా కోసం రూ.11,835 చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో స్టూడెంట్ వీసా కోసం రూ.50,428 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు పార్లమెంటులో చట్టం కూడా తయారైందని బ్రిటన్ హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, పెంచిన వీసా ఫీజులు, హెల్త్ సర్ చార్జీల ద్వారా వచ్చే సొమ్మును జాతీయ ఆరోగ్య పథకానికి అందిస్తామని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు.