ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారత్ వైపు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఇవాళ దక్షిణ భారత్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ పార్వతీపురం మన్యం, శ్రీ సత్యసాయి, అల్లూరి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇలానే వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది.
గత రాత్రి (సెప్టెంబర్ 16న) కోస్తా ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఉత్తర ఆంధ్రాలోని పలు జిల్లాల్లో చిరు జల్లులు కురిసాయి. ఇవాళ రాత్రికి రాయలసీమలో చిరు జల్లులకు అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల క్యుములోనింబస్ మేఘాలు వస్తున్నాయని.. అవి వచ్చిన ప్రదేశంలో మాత్రమే భారీ వర్షాలకు ఛాన్స్ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం బంగాళాఖాతం, అరేబియా సముద్రంపై మేఘాలు ఉన్నాయని ఆవర్తనం ఏర్పడితే వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అన్నారు.