లిబియాలో వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తీరప్రాంతాల్లో 11వేల మందికి పైగా మరణించారు. దీంతో మృతుల సంఖ్య 21 వేలు దాటే అవకాశం ఉందని.. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారి క్లైర్ నిక్లెట్ తెలిపారు. మృతదేహాల వెలికితీత ఆలస్యం అవుతుండడంతో అంటురోగాలు వ్యాపించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే డెర్నాలో దాదాపు 150 మంది డయేరియాతో బాధపడుతున్నట్లు వైద్యాఅధికారి హైదర్ అల్-సాయి తెలిపారు.