టీడీపీతో జనసేన కలిస్తే.. నిప్పుకు గాలి తోడు అయినట్లేనని తెలుగుదేశం సీనియర్ నేత పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తే.. వైసీపీకి డిపాజిట్ రాదని ఆనేతలే ఒప్పుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి డిపాజిట్లు గల్లంతు అవటం ఖాయం. చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. ఏపీ సర్కార్ పెట్టే కేసులకు టీడీపీ కార్యకర్తలే భయపడటం లేదు. తన ఓటమిని వైసీపీ నేతలు ఎన్నికలకు ముందే ఒప్పుకుంటున్నారని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.