మైదుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు మైదుకూరు లో టిడిపి నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. మంగళవారం ఈ దీక్షలో మైదుకూరు నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీలు అత్యధికంగా పాల్గొని తమ నిరసనను తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి జెండాల మహబూబ్ బాషా, జలీల్ అహ్మద్, అచ్చుకట్ల జిలాన్, కమలాపురం గౌస్ పాల్గొన్నారు.