కేరళ నుంచి స్వస్థలానికి తిరిగి వచ్చిన పశ్చిమ బెంగాల్ వ్యక్తిలో నిపా వైరస్ లక్షణాలు కనిపించాయి. కేరళలో వలస కూలీగా పనిచేస్తున్న బుర్ద్వాన్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల యువకుడికి తీవ్ర అస్వస్థత తలెత్తింది. తీవ్ర జ్వరం, వికారం, గొంతు ఇన్ఫెక్షన్తో బాధపడుతూ కోల్కతా ఆసుపత్రిలో చేరాడు. అయితే ఆ యువకుడికి నిపా వైరస్ సోకిందే లేదో తెలుసుకోవడానికి అవసరమైన పరీక్షలు చేయాలని వైద్య అధికారులు వెల్లడించారు.