ఉత్తరప్రదేశ్ లోని నిచ్లాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లేధి గ్రామంలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. ఐదేళ్ల బాలిక ఓ తోటలో తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా, దీపక్ అనే యువకుడు (21) సైకిల్ పై అక్కడికి వచ్చాడు. బాలిక ఆడుకుంటూ అతని సైకిల్ ను తాకగా, ఆగ్రహించిన యువకుడు బాలిక గొంతు కోశాడు. స్థానికులు బాలికను కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.