దేశంలోని టీవీ చానెళ్లకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా కీలక సూచనలు చేసింది. తీవ్ర నేరాలు, ఉగ్రవాదం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు లేదా ప్రభుత్వం నిషేధించిన సంస్థలకు చెందిన వ్యక్తులకు టీవీల్లో వేదిక ఇవ్వొద్దని కోరింది. ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను సమర్థిస్తున్నప్పటికీ, టీవీ చానెళ్లు ప్రసారం చేసే కంటెంట్ టీవీ నెట్ వర్క్స్ చట్టం కింద నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించింది.