కాపు సంక్షేమసేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి వెంకట హరిరామజోగయ్య కాపు సంక్షేమసేన రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించడానికి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆయా జిల్లాల కో–ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, కాపు సంక్షేమ సేన పలు విభాగాల రాష్ట్ర అధ్యక్షులు సుమారు 60 మంది సమావేశానికి హాజరు కానున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు అంశాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించినందున భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్రంలో జగన్ రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించడానికి టీడీపీ, జనసైనికులు కాపు సంక్షేమ సేన పూర్తిస్థాయిలో పోరాటం సాగించాల్సిన తరుణం ఆసన్నమైనందున టీడీపీ, జనసేన పొత్తుపై కాపు సామాజిక వర్గీయులలోనే నెలకొన్న భిన్నాభిప్రాయాలను, వారిలో నెలకొన్న సందేహాలను ఈ సమావేశం ద్వారా నివృత్తి చేయనున్నారు.