బీజేపీ ఎంపీ రమేష్ బిదురి అన్‌పార్లమెంటరీ ప్రవర్తనపై ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియ సూలే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘రమేష్ తరచుగా ఇలానే ప్రవర్తిస్తారు. ఆయనపై టీఎంసీ నేతతో కలిసి స్పీకర్‌కు లేఖ రాశాను. రెండు రోజుల క్రితం ఓ సీనియర్ సభ్యుడినీ కించపరిచారు. ఇది ప్రజాస్వామ్యమేనా? ఇటువంటి వాటిని తీవ్రంగా ఖండిస్తాం. వీటిపై ప్రివిలేజ్డ్ మోషన్ ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టాను’’అని చెప్పారు.