చంద్రబాబు అరెస్టు అనంతరం జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒక విధమైన నిరసన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేపట్టింది. దీంతోపాటు రిలే దీక్షలు కూడా కొనసాగిస్తోంది. అనంతరంలో నిర్వహించిన రిలే దీక్షల్లో నేడు సింగనమల నియోజకవర్గం కో కన్వీనర్ నర్సనాయుడు, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ఆదెన్న పాల్గొన్నారు. చంద్రబాబును కుట్ర పూరితంగా అరెస్ట్ చేశారనే విషయాన్ని ప్రజలందరూ గ్రహించారన్నారు.