ఉమ్మడి అనంతపురం జిల్లాలో 'జగనన్న ఆరోగ్య సురక్ష'లో భాగంగా ముమ్మరంగా వైద్య పరీక్షలు శనివారం నిర్వహించారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. అనంతపురం జిల్లాలో 1, 53, 893 మందికి, శ్రీసత్యసాయి జిల్లాలో 1, 18, 561 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు. బాధితులను ఈ నెల 30 నుంచి నిర్వహించే ఆరోగ్య శిబిరాల్లో డాక్టర్ల వద్దకు తీసుకెళతారు.