అనకాపల్లి పట్టణం పిసినికాడలో ఉరేసుకుని ఓ వ్యక్తి సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సై నర్సింగరావు తెలిపిన వివరాల మేరకు విజయనగరం జిల్లా రాజాంకు చెందిన గురుస్వామి(45) పిసినికాడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో వెల్డర్ గా పనిచేస్తున్నారు. అనారోగ్యంతో ఆదివారం రాత్రి పిసినికాడలో తాను ఉంటున్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యా అనురాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa