31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు సంబంధించి ఈ నెల 30న జిల్లాలోని అన్ని యాజమాన్యాల్లో పని చేస్తున్న సైన్స్ ఉపాధ్యాయులకు జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఈఓ శైలజ బుధవారం తెలిపారు. గుంటూరు పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్ లో శనివారం ఉదయం 9 గంటలకు జరగనున్న సదస్సుకు అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల నుంచి ఒక సైన్స్ ఉపాధ్యాయుడు హాజరు కావాలని ఆదేశించారు.