పన్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం మండలంలోని చౌటపాపాయపాలెంలో గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైసీపీ మండల కన్వీనర్ వేపూరి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి అంబటి రాంబాబు ఇంటింటికి తిరిగి సంక్షేమ లబ్ధిని ప్రజలకు వివరిస్తారని వెల్లడించారు.