స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్ నేరస్తుడు జైల్లో ఉంటే.. ఇన్నర్‌రింగ్‌రోడ్ స్కామ్‌లో నిందితుడైన లోకేశ్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి గారిని కలవడమనేది హాస్యాస్పదం. మరి, లోకేశ్ ఇన్నర్‌రింగ్ రోడ్ స్కామ్‌పై చాలా అమాయకంగా నటిస్తూ మాట్లాడుతున్నాడు రోజా వాపోయారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... అసలు, ఇన్నర్‌రింగ్ రోడ్డే లేదు కదా.. స్కామ్ ఎలా జరుగుతుందని ఆయన దీర్ఘాలు తీస్తున్నాడు. కానీ, ఆయన తండ్రి మాయాజాలం అతనికి అర్ధమైందో లేదో గానీ.. ప్రజలకు మాత్రం ఇన్నర్ రింగ్‌రోడ్ స్కామ్ పట్ల స్పష్టత వచ్చింది. - అమరావతి రాజధానికి ఇన్నర్ రింగ్ రోడ్ లేకుండానే... చంద్రబాబు పెద్ద ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించినట్లు గ్రాఫిక్స్‌ల్లో కళ్లకు కట్టినట్టు చూపించి లింగమనేని తదితరులు దగ్గర రూ.కోట్లు విలువైన భూమిని కొట్టేసి క్విడ్‌ప్రోకోకు ఎలా పాల్పడ్డాడో అందరికీ తెలుసు. లేని రోడ్లకే గ్రాఫిక్కులు చూపించి స్కామ్ చేసినోడు.. ఇక, ఉన్న రోడ్లను చూపెట్టి ఎంత దండుకుంటాడో అనేదీ అందరూ ఆలోచన చేయాలి. ఈవిధంగా తండ్రీకొడుకులు కలిసి క్విడ్‌ప్రోకోకు పాల్పడి ఈ రాష్ట్ర సంపదను అడ్డంగా దోచుకుని ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో అందరికీ అవగాహన కావాల్సిన సమయమని తెలియజేసారు.