సీఎం జగన్కు ఎన్నికల భయం పట్టుకుందని, మొన్నటివరకు ‘వై నాట్ 175’ అన్న ముఖ్యమంత్రి.. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలామందికి టిక్కెట్లు ఇవ్వనంటున్నారని, ఎన్నికల భయంతోనే తెగ మీటింగులు పెడుతూ, హడావుడి చేస్తున్నారని మాజీ మంత్రి పీతల సుజాత విమర్శించారు. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపై వైసీపీ నేతల విమర్శలు తగదన్నారు. జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల, విజయలక్మి, భారతీలు జగన్ కోసం ఆరాటం పడలేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు కోసం వచ్చిన భువనేశ్వరి, బ్రాహ్మణి లపై విమర్శలు చేస్తే, సహించేది లేదని పీతల సుజాత హెచ్చరించారు.