జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్రను విజయవంతం చేయాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం జరిగిన పార్టీ జిల్లా, నగర అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుపై పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం ప్రజాకర్షకమని అన్నారు. అక్టోబరు 1న అవనిగడ్డలో వారాహి యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. టీడీపీతో పొత్తు, ఉమ్మడి కార్యాచరణపై మాట్లాడుతూ... విస్తృత స్థాయి సమావేశంలో ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామని పవన్ ప్రకటించారు అని తెలిపారు.