ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, ఎండీయూ ఆపరేటర్లకు వాహనమిత్ర ఐదో విడత ఆర్థిక సాయాన్ని శుక్రవారం అందించనున్నారు. విజయవాడ నగరం విద్యాధరపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదును జమ చేయనున్నారు. 2023-24 సంవత్సరానికి 2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.275.93 కోట్ల ఆర్థిక సాయం అందజేయనున్నారు.