శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నా విశాఖలో పోలీసులు అడ్డుకుంటున్నారని టీడీపీ విశాఖజిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో ఆందోళన చేసే హక్కు కూడా పోలీసులు కాలరాస్తున్నారన్నారు. గురువారం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడరాఉ. ఎప్పుడు లేని విధంగా విశాఖలో క్రైమ్ పెరిగిందని , గంజాయి విపరీతంగా పెరిగిందన్నారు.