పెండింగ్‌లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసి త్వరగా పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అదికారులను కర్నూలు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..... పోలీసు అధికారుల వద్ద అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, త్వరగా ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసి పంపించినట్లయితే పరిహారాన్ని రెవెన్యూ శాఖ నుంచి త్వరగా బాధితులకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.