రాజమండ్రి నగరంలో ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్లను తూ. గో జిల్లా కలెక్టర్ కె. మాధవి లత శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎంల భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో చైత్ర వర్షిని, పలువురు అధికారులు పాల్గొన్నారు.