నవరత్నాలు పేదలందరికీ ఇల్లు సామూహిక గృహప్రవేశాల్లో భాగంగా అక్టోబర్ 5వ తేదీన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సామర్లకోట రాక నేపథ్యంలో సామర్లకోట రాగంపేట రోడ్ లో గల ఈటిసి జగనన్న లేఅవుట్ నందు మౌలిక వసతి పనులను జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ మౌలిక వసతులు 100% పూర్తి కావాలని వారు ఆదేశించారు. జగన్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.