యూపీ బందా జిల్లాలో శుక్రవారం దారుణం వెలుగుచూసింది. ఓ మహిళను ఆమె భర్త, సవతి కొడుకులు, మేనల్లుడు దారుణంగా హతమార్చారు. చేతి వేళ్లు, జుట్టు కత్తిరించి, పళ్లను ఛిద్రం చేసి తల నరికేశారు. మృతురాలు మధ్యప్రదేశ్ కు చెందిన మాయాదేవిగా పోలీసులు గుర్తించారు. అనుమానంతోనే భర్త, కొడుకులు చామ్రా గ్రామానికి తీసుకెళ్లి దారుణంగా హతమార్చినట్లు తెలిపారు. 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.