దేశ రాజధాని ఢిల్లీ నుంచి నైరుతి రుతుపవనాలు తిరోగమన బాట పట్టాయని ఐఎండీ వెల్లడించింది. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి ఏడాది జూన్ 27వ తేదీ నుంచి ఢిల్లీలో వర్షాకాలం మొదలువుతంది. ఇక సెప్టెంబర్ 25వ తేదీ నుంచి రుతుపవనాలు వెళ్లిపోతాయి. అయితే ఈ ఏడాది జూన్ 25వ తేదీ నుంచే నగరంలో వర్షాలు కురిశాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి కూడా రుతుపవనాలు తిరుగుబాట పట్టాయి.