మన దేశంలో యూపీఐ(UPI) చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా యూపీఐ చెల్లింపుల్లో మళ్లీ రికార్డ్ నమోదైంది. యూపీఐ ద్వారా లావాదేవీలు వరుసగా రెండోసారి 10 బిలియన్ మార్క్‌ను దాటాయి. గడిచిన ఆగస్టులో యూపీఐ లావాదేవీలు మొదటిసారిగా 10 బిలియన్ లావాదేవీలు నమోదు కాగా, సెప్టెంబర్‌లో సైతం మళ్లీ 10 బిలియన్ లావాదేవీలు జరిగాయి. సెప్టెంబర్ 30 వరకు 10.55 బిలియన్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు NPCI తెలిపింది.