ఎచ్చెర్ల మండలంలోని బైపాస్ జంక్షన్ వద్ద గల మండల వైసీపీ కార్యాలయంలో బుధవారం ఉదయం 9 గంటలకు 'ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే' (వై ఏపీ నీడ్స్ జగన్) మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పాల్గొంటారని మండల పార్టీ అధ్యక్షులు ముద్దాడ శంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు హాజరుకావాలన్నారు.