దేశంలో అన్ని రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్లో ప్రజల అభిప్రాయంపై టైమ్స్ నౌ సంస్థ తాజాగా విస్తృతంగా సర్వే చేసింది. సర్వేకు సంబంధించిన ఫలితాలను సోమవారం రాత్రి టైమ్స్ నౌ చానల్ ప్రసారం చేసింది. విశ్లేషకులతో చర్చ నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో 22 లోక్సభ స్థానాల్లో విజయం సాధించిన వైయస్ఆర్సీపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 24–25 ఎంపీ స్థానాల్లో విజయభేరీ మోగిస్తుందని సర్వేలో వెల్లడైందని వ్యాఖ్యాత పద్మజాజోషి వెల్లడించారు. అధికార పార్టీ 22 లోక్సభ స్థానాల నుంచి 25 ఎంపీ సీట్లలో క్లీన్ స్వీప్ చేసి తిరుగులేని విజయం సాధించే స్థాయికి చేరుకుందని తెలిపారు.