కార్వేటి నగర మండలం, ఆర్కే వీబిపేట గ్రామపంచాయతీలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పర్యటన ఉన్న నేపథ్యంలో, జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బ్యానర్లను పంచాయతీ కార్యదర్శి తొలగించారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో, స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, సర్ది చెప్పి బ్యానర్లు తొలగించారు. అయితే డిప్యూటీ సీఎం నారాయణస్వామి పర్యటనకు జనసేన బ్యానర్లు అడ్డమా అని జనసైనికులు మండిపడుతున్నారు.