ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా గడిచిన మూడేళ్లుగా ఇన్చార్జి, పూర్తిస్థాయిగా కొనసాగుతున్న పీవీజీడీ ప్రసాదరెడ్డి పదవీ కాలం నవంబరుతో ముగియనుంది. దీంతో ఏయూతోపాటు రాష్ట్రంలోని ఆరు యూనివర్సిటీల వీసీ పోస్టులు ఖాళీ అవుతుండడంతో భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఏయూ వైస్ చాన్సలర్ పోస్టు కోసం సుమారు 40 మంది దరఖాస్తు చేసినట్టు తెలిసింది.