బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఓ ప్రభావతి దేవి గంగాధర నెల్లూరు మండలం తుంగుండ్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆంబోదరపల్లిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. కంటి అద్దాలు పంపిణీ చేశారు. స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా ఆరోగ్యసేవలు అందుబాటులో ఉన్నాయి కావున ప్రజలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని, అన్నిరకాల మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.