ఉత్తరప్రదేశ్లోని గోండాలో దారుణం చోటు చేసుకుంది. సిద్ధార్థ్ నగర్లో నివాసముంటున్న మీనాదేవి (35) తన కూతుళ్లతో కలిసి ఉంటోంది. ఈమెకు తాంత్రికుడు భగవాన్ దీన్ పరిచయం అయ్యాడు. తరచూ వీరి ఇంటికి రావడంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ కలిసి కిచోచా షరీఫ్ దర్గాకు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. క్షణికావేశంలో మీనాదేవి గొంతుకోసి మృతదేహానికి నిప్పంటించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.